News July 7, 2024
ఓదెల మల్లన్న ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం

పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 15న పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏటా ఏకాదశి ముందు పెద్ద పట్నాలు, అగ్నిగుండ మహోత్సవం పెద్దఎత్తున నిర్వహిస్తారు. కావున భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు.
Similar News
News November 15, 2025
భరోసా కేంద్రాన్ని సందర్శించిన కరీంనగర్ సీపీ

కరీంనగర్ భరోసా కేంద్రాన్ని సీపీ గౌష్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాధిత మహిళలకు భరోసా కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని, భరోసా కేంద్రం ఏర్పాటు చేసినప్పటినుండి బాధితులకు అందించిన సేవలు, వాటి సత్ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే చోట న్యాయ సహాయం, వైద్యం, సైకోథెరపీ అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.
News November 15, 2025
కఠోర శ్రమతోనే లక్ష్య సాధన: కలెక్టర్

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిత్యం కఠోరంగా శ్రమించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె మాట్లాడుతూ.. బాలబాలికలు అనవసర విషయాలను పట్టించుకోకుండా, తమ ధ్యాసనంతా చదువుపైనే కేంద్రీకరించాలని సూచించారు.
News November 15, 2025
KNR: టాస్క్ జాబ్ మేళాకు విశేష స్పందన.. 54 మంది షార్ట్లిస్ట్

KNR IT టవర్లోని టాస్క్ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 209 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని టాస్క్ ప్రతినిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించగా, 54 మంది అభ్యర్థులు షార్ట్లిస్ట్ అయ్యారు. వీరికి త్వరలో తుది రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని వారు వెల్లడించారు.


