News August 12, 2024

ఓపెన్ డిగ్రీ, డిప్లమా, PG చేయాలని ఉందా!

image

HYDలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 31 దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా ఓపెన్ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు. స్థానిక స్టడీసెంటర్లో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News October 20, 2025

మెదక్: అగ్నిమాపక కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

మెదక్ జిల్లా రామాయంపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అగ్నిమాపక సేవలపై హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని పరికరాల పనితీరు, వాహనాల వినియోగం, హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సిబ్బంది వెంటనే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 19, 2025

మెదక్: పాతూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ మండలం పాతూరు సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News October 19, 2025

మెదక్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సుశాంత్ గౌడ్ ఎంపిక

image

గ్రూప్-2 పరీక్షల్లో మెదక్ పట్టణానికి చెందిన మంగ నారా గౌడ్, ఇందిర దంపతుల తనయుడు సుశాంత్ గౌడ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సుశాంత్ గౌడ్ ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉత్తర్వులు అందుకున్నారు.