News September 23, 2024
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఈ విషయాన్ని గమనించి అడ్మిన్ల సంఖ్య పెంచాలని డీఈవో తెలిపారు.
Similar News
News November 4, 2025
ఆఫీస్‌కు వస్తే.. ముందు ఈ పని చేయండి: కలెక్టర్

ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘మీకోసం’ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రథమ పనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు.
News November 4, 2025
ప్రకాశం: ఉచితంగా 3 వీలర్ మోటారు సైకిల్స్.. అప్లై చేయండిలా.!

రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 25లోపు www.apdascac.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండి 70% అంగవైకల్యం కలిగినవారు అర్హులన్నారు.
News November 4, 2025
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.


