News April 15, 2025
ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ పమేలా

కరీంనగర్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి 100 శాతం ఫలితాలు సాధించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా, ఉపాధి అవకాశాలకైనా విద్యార్హతలు ముఖ్యమని కలెక్టర్ అన్నారు.
Similar News
News November 13, 2025
కరీంనగర్లో ఈనెల 18న JOB MELA

జిల్లాలోని నిరుద్యోగులకు ఓ ప్రముఖ జ్యూవెలర్స్లో ఈనెల 18న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయస్సు19- 30 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులన్నారు. వేతనం రూ.20,000 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆసక్తి గలవారు నవంబర్ 18న వచ్చి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పైనంబర్లను సంప్రదించవచ్చు.
News November 13, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్గా కరీంనగర్

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.
News November 12, 2025
హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


