News September 13, 2024

ఓయూలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు

image

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 21న అఖిల భారత మహిళా విద్యావేత్తల సదస్సు జరగనుందని కాన్ఫరెన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ మంచుకొండ శైలజ తెలిపారు. సదస్సును ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. సదస్సుకు NHRC అధ్యక్షురాలు విజయ భారతి సయాని తదితరులు హాజరవుతారని పేర్కొంది. ఈ సదస్సులో వికసిత భారత్ నిర్మాణంలో మహిళా విద్యావేత్తల పాత్ర తదితర అంశాలపై ప్రముఖులు మాట్లాడనున్నట్లు తెలిపింది.

Similar News

News November 27, 2025

ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్‌: ఎండీ

image

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్‌లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

News November 27, 2025

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

image

సిగాచీ పేలుళ్ల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం న్యాయవేదికను కదిలించింది. 54 ప్రాణాలు బలిగొన్న ఘోర విషాదం ఇంకా స్పష్టమైన నిజానిజాలు లేకుండానే సాగిపోతుందని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీ నివేదికలు, సాక్షాలు, చట్టపరమైన లోపాలన్నీ ముందుంచినా దర్యాప్తు పురోగతి శూన్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వచ్చేనెల 9కి వాయిదా వేసింది.

News November 27, 2025

హైదరాబాద్ బిర్యానీ తగ్గేదేలే!

image

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే బెస్ట్ ఫుడ్ జాబితాలో HYD బిర్యానీ ఉంటుందని మరోసారి నిరూపితమైంది. ఫుడ్ గైడ్ టెస్ట్ అట్లాస్ జాబితా ‘50 ఉత్తమ బియ్యం వంటకాలు- 2025’లో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో ఇది వెల్లడైంది. HYD బిర్యానీ కంటే ముందు నెగిటోరోడాన్, సూషి, కైసెండన్, ఒటోరో నిగిరి, చుటోరో నిగిరి, నిగిరి, మాకి నిలిచాయి. ఇంతకీ HYDలో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది.