News January 26, 2025
ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News January 5, 2026
HYD: ఆధార్ సెంటర్ ఎక్కడో ఈజీగా తెలుసుకోండి

గ్రేటర్ పరిధి రామంతాపూర్లో ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాసిన కథనంపై ఆధార్ సర్వీస్ యంత్రాంగం స్పందించింది. ఆధార్ అప్డేట్ చేసుకునేవారు పెరగటంతో రద్దీ ఏర్పడుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. గ్రేటర్ HYD వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, వాటి వివరాలు తెలుసుకోవడం కోసం bhuvan.nrsc.gov.in/aadhaar/ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.
News January 5, 2026
పాకిస్థాన్లోని ఉగ్రమూకలను లాక్కురండి: ఒవైసీ

ఇండియాలో పలు చోట్ల విధ్వంసం చేసి పాకిస్థాన్లో దాక్కున్న ఉగ్రమూకలను అక్కడకెళ్లి లాక్కురావాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. వెనుజులా అధ్యక్షుడినే అమెరికా తీసుకెళ్లినపుడు.. మీరు ఉగ్రవాదులను పాకిస్థాన్ నుంచి ఇక్కడకు తీసుకురాలేరా? అని ముంబయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని ప్రశ్నించారు. పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులను లాక్కురండి అని పేర్కొన్నారు.
News January 5, 2026
HYD: పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత?

GHMC 300 వార్డుల పరిధిలో ఆస్తి పన్ను పంపిణీపై క్లారిటీ వచ్చేసింది. 10 వేల చదరపు అడుగుల లోపు ఇల్లు లేదా ప్లాట్ అయితే DC చూసుకుంటారు. అంతకంటే ఒక్క అడుగు ఎక్కువ ఉన్నా ఫైలు నేరుగా ZC టేబుల్పైకి వెళ్లాల్సిందే. 5ఏళ్ల కంటే పాత బకాయిల అడ్జస్ట్మెంట్ వ్యవహారాల్లోనూ ZC గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. చిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ సరిపోతారు. కానీ, పెద్ద ప్రాపర్టీల లెక్క మాత్రం జోనల్ లెవల్లోనే తేలుతుంది.


