News January 26, 2025
ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 31, 2025
కరీంనగర్ జిల్లాలో 34వేల ఎకరాల్లో పంట నష్టం

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 183 గ్రామాల్లో 29,797 మంది రైతులకు చెందిన 34,127 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వీటిలో 30,565 ఎకరాల్లో వరి, 3,512 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో మక్కపంటలు దెబ్బతిన్నాయి. HZB డివిజన్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. అధికారులు పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
News October 31, 2025
MBNR: U-17 రగ్బీ.. NOV 3న ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్-17 విభాగంలో రగ్బీ ఎంపికలు ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి Way2Newsతో తెలిపారు. మహబూబ్ నగర్లోని స్టేడియం గ్రౌండ్లో నవంబర్ 3న అండర్-17 విభాగంలో బాల, బాలికల రగ్బీ ఎంపికలు ఉంటాయని, ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలని, ఆసక్తి గల క్రీడాకారులు స్కూల్ ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు.
News October 31, 2025
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (1/2)

ఆంధ్రప్రదేశ్లో బొండానికి, టెంకాయకు మేలైన కొబ్బరి రకాలు.
☛ ఈస్ట్కోస్ట్ టాల్: ఇది దేశవాళి పొడవు రకం. నాటిన 6 ఏళ్లలో కాపునకు వస్తుంది.  చెట్టుకు ఏడాదికి 80-100 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గౌతమి గంగ: ఇది పొట్టి రకం. నీటి బొండాలకు బాగా ఉపయోగపడుతుంది. నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 85-90 కాయల దిగుబడి వస్తుంది. కాయలో నూనె దిగుబడి 69 శాతం. 


