News November 24, 2024
ఓయూలో రాజకీయ సభలకు అనుమతివ్వొద్దు: BRSV

ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.
Similar News
News November 18, 2025
శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.
News November 18, 2025
శంషాబాద్: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్లోని సామ ఎన్క్లేవ్లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.