News November 24, 2024
ఓయూలో రాజకీయ సభలకు అనుమతివ్వొద్దు: BRSV
ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.
Similar News
News December 7, 2024
ఖైరతాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ.. కేంద్రమంత్రికి ఆహ్వానం
రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.
News December 7, 2024
సోనియాగాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తాం: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రదాత ప్రియతమ నాయకురాలు సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్లళ్లో BRS ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేసిచూపించిందన్నారు. ఇప్పటివరకు 55వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
News December 7, 2024
HYD ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్?
హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి రవాణా, బీసీ సంక్షేమ శాఖలు కేటాయించడంతో పాటు HYD ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా HYDలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీబస్సు పథకం ప్రారంభం, పెండింగ్ ఫ్లైఓవర్లు, నాలాల నిర్మాణం చేపట్టారన్నారు. మీ కామెంట్?