News November 24, 2024
ఓయూలో రాజకీయ సభలకు అనుమతివ్వొద్దు: BRSV

ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.
Similar News
News July 5, 2025
HYD: ‘వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వీ కర్ణన్ అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News May 8, 2025
ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News May 7, 2025
హయత్‌నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.