News June 23, 2024
ఓయూలో వన్ టైం ఛాన్స్.. మిస్ అవ్వకండి..!
HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులు పూర్తి చేసి బ్యాక్ లాగ్స్ సబ్జెక్టులు మిగిలిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కల్పించినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 13, 2024
HYD: మంత్రి పొంగులేటితో ముఖాముఖి
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకే మంత్రులతో ముఖాముఖి ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే ఆయా అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
News November 13, 2024
మాజీ MLA పట్నం నరేందర్ అరెస్ట్ దుర్మార్గం: హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు
News November 13, 2024
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు
గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతగల భారతీయ పౌరులు, భారతీయ విదేశీ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 9 డిసెంబర్ 2024. అప్లై చేసిన హార్డ్ కాపీ డిసెంబర్ 16 లోపు పంపించాలి. మరిన్ని వివరాలకు https://uohyd.ac.in/careers-uoh/ సందర్శించవచ్చు. SHARE IT