News January 25, 2025
ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
Similar News
News January 8, 2026
భద్రాద్రి: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు

టెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా గురువారం భద్రాద్రి జిల్లాలో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ పరీక్షా కేంద్రంలో సెషన్ 1కు మొత్తం 100 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 87 మంది హాజరై 13 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అదే విధంగా సెషన్2కు 100 మంది అభ్యర్థులు కేటాయించబడగా, 56 మంది హాజరై 44 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ వివరించారు.
News January 8, 2026
ఏలూరు: ఎంపీ దృష్టికి కోకో రైతుల సమస్యలు

ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో గురువారం కోకో రైతులు ఎంపీ మహేశ్ కుమార్‌ని కలిసి సమస్యలు విన్నవించారు. కంపెనీలు సిండికేట్‌గా మారి, ధరలు తగ్గించి రైతులను మోసగిస్తున్నాయన్నారు. మన దేశ అవసరాలకు కావాల్సిన కోకో గింజలు 20% మాత్రమే దేశంలో ఉత్పత్తి జరుగుతుందని, 80% కోకో గింజలు, కోకో ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటున్నామని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
News January 8, 2026
పాతబస్తీ మెట్రో పనులపై పీపీటీ ఇవ్వండి: హైకోర్టు

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చారిత్రక నిర్మాణాలు దెబ్బతినేలా మెట్రో ఫేజ్-2 పనులు చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌ను కోర్టు విచారించింది. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. దీనిపై పీపీటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పగా, అందుకు ధర్మాసనం అంగీకరించింది.


