News January 25, 2025

ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

Similar News

News December 5, 2025

పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

News December 5, 2025

అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్‌లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.

News December 5, 2025

RR: ఉమెన్స్ షూటింగ్ బాల్ ఎంపికలు రేపే

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహిళలు, బాలికల కోసం రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ షూటింగ్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని సెంట్ మార్క్స్ స్కూల్‌లో ఎంపికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారిణులు తమ బోనఫైడ్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు.