News April 9, 2025
ఓయూలో 470 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!

ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 601 మంజూరు పోస్టులకు గాను 131 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 470 ఖాళీలు ఉన్నాయి. అకాడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో సగమే భర్తీ చేస్తారని సమాచారం.
Similar News
News April 25, 2025
మెదక్ కలెక్టరేట్‌లో మహిళా వ్యాపారులకు అవగాహన

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు. కలెక్టరేట్‌లో వీ హబ్ ద్వారా జిల్లాలోని SHG మహిళలు, మహిళా పారిశ్రామిక వేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ స్కీమ్) పై అవగాహన కల్పించారు.
News April 24, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గఫూర్ అనే వ్యక్తి దౌల్తాబాద్‌లో కూలీ పని కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పులిమామిడి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని స్థానికులు తెలిపారు.
News April 24, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో కలప వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన చిన్న నర్సింహా రెడ్డి(56) సిద్దిపేటలోని గ్రీన్ కాలనీలో టింబర్ డిపో నడిపిస్తున్నాడు. వ్యాపారం కోసం చేసిన అప్పులు తీరకపొవడంతో మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.