News November 15, 2024
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా నల్లమల బిడ్డ

HYD ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా నల్లమల ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఖాసిం నియామకమయ్యారు. దీంతో ఆయన స్వగ్రామమైన లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో సంబరాలు జరుపుకొన్నారు. తమ ప్రాంత వాసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడని, రాష్ట్ర ఏర్పాటులో ఓయూ కీలక పాత్ర వహించిందని, అంత గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆయన ఎంపికవడం తమకు గర్వంగా ఉందన్నారు.
Similar News
News March 14, 2026
సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
News March 14, 2026
MBNR: ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొడతా లేదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సిలిండర్ల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందకూడదన్నారు. సంక్షేమ హాస్టల్లో హాస్పిటళ్లు విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదని వెల్లడించారు.
News March 14, 2026
నేడు గద్వాలకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.


