News April 7, 2024
ఓయూ: ఇంటర్, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
వరల్డ్‌లో HYD బిర్యానీ ది BEST!

HYD బిర్యానీ.. ఈ పేరు ఒక ఎమోషన్. దీని రుచి వరల్డ్ ఫేమస్. సిటీలో దమ్ బిర్యానీ తింటే ఫిదా అవ్వాల్సిందే. మాంసానికి మసాలా అంటించి, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ రసం బాగా పట్టిస్తారు. బాస్మతి రైస్‌తో మాంసాన్ని ఉడికించి బిర్యానీ రెడీ చేస్తారు. ఫైనల్‌గా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు ఈ వంటకానికి మరింత రుచినిస్తాయి. ఇన్ని మిశ్రమాలతో చేసే HYD బిర్యానీ వరల్డ్ బెస్ట్‌గా నిలవడం విశేషం.
నేడు World Biryani Day
News July 6, 2025
HYD: 95 ఏళ్లు.. చెక్కుచెదరని అషుర్‌ఖానా!

HYDలోని ‘అజా ఖానే జెహ్రా’ అషుర్‌ఖానా మొహర్రం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. 1930లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అషుర్‌ఖానా దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. శియా భక్తుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన ఈ కట్టడం మూసీ నది ఒడ్డున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. నేడు ఈ దుఃఖ మందిరానికి భారీగా ముస్లింలు తరలిరానున్నారు.
News July 6, 2025
HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

సెకండ్ హ్యాండ్‌లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.