News March 5, 2025
ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్ – ఈవినింగ్) కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
Similar News
News November 24, 2025
HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.


