News April 19, 2024

ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Similar News

News September 12, 2024

HYD: సెప్టెంబర్ 17..ముఖ్య అతిథులు వీరే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. HYD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, RR జిల్లాలో స్టేట్ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

News September 12, 2024

HYD: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం TIME FIX

image

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనంపై HYD సిటీ కమిషనరేట్ సీపీ CV ఆనంద్ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 17వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీ అంగీకరించినట్లు తెలిపారు. సమయానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, అనుకున్న సమయానికి నిమజ్జనం చేయాలన్నారు. ఇందుకు తగ్గట్లు పోలీసు బందోబస్తు ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు.

News September 12, 2024

HYD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి: మంత్రి

image

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ HYDలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో ‌నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.