News April 2, 2024
ఓయూ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
GHMCలో విలీనం.. 2 రోజుల్లో GO?

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తామని సర్కారు ప్రకటించడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. విలీనానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా విలీన ప్రక్రియ ముగించాలని సీఎం ఆదేశించారు.
News November 27, 2025
CUA మహా మాస్టర్ ప్లాన్: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.
News November 27, 2025
పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ

గ్రేటర్లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేసినపుడు కూడా అదే పరిస్థితి.


