News February 11, 2025
ఓయూ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News December 6, 2025
NGKL: ప్రజాస్వామ్యం అంటే మోదీకి విలువలేదు: ఎంపీ

ప్రజాస్వామ్యం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విలువలేదని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గేను ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విలువలను పక్కనపెట్టి ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు.
News December 6, 2025
రాజన్న సిరిసిల్ల: 21న లోక్ అదాలత్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పుష్పలత సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
News December 6, 2025
SRCL: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి ఇన్‌ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు నియామక పత్రం, ఫామ్-14, ఎపిక్ కార్డు తీసుకుని తమ సొంత మండల పరిషత్ అభివృద్ధి అధికారికి అందజేయాలన్నారు.


