News August 29, 2024

ఓయూ పీజీ పరీక్షలు 19కి వాయిదా

image

ఓయూ పరిధిలో జరగనున్న పీజీ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు వచ్చేనెల 19కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలను యుజిసి నెట్, టిఎస్ సెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

Similar News

News February 25, 2026

HYD: అమ్మాయిలూ ఇది మిస్ అవ్వకండి

image

మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కరోనా టీకా తరహాలో ఫ్రీ వ్యాక్సిన్‌ను నిర్ణయించింది. త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా.. ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మంది ఉంటారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అంచనా. సమీప PHCల్లో 6 నెలల వ్యవధిలో 3 టీకాలు ఉచితంగా అందించనున్నారు.

News February 25, 2026

HYD: నేనేం నేరం చేశానమ్మా..

image

‘ఏడిస్తే గుండెలకు హత్తుకుంటావని, ఆకలైతే పాలు తాగిస్తావని అనుకున్నానమ్మా. చిట్టిచేతులు కట్టేసి, గంతలు కడితే దాగుడు మూతలు ఆడుతున్నావ్ అనుకున్నానమ్మా! పొయ్యిలో నన్ను కాలుస్తుంటే ఇలా నిన్ను అమ్మా అని పిలుస్తాననుకోలేదు. నోట్లో గుడ్డలు కుక్కింది నువ్వని తెలిసి విలవిలలాడానమ్మా. ఏంనేరం చేశా నాకెందుకీ శిక్ష’ భౌరంపేట్‌లో <<19230114>>పసిబిడ్డ<<>> ఇలా అనుకుని ఉంటుందేమో. 9నెలలు మోసిన తల్లే చంపడం నగరాన్ని కలవరపెడుతోంది.

News February 25, 2026

HYD: మీకూ ఈ లక్షణాలు ఉన్నాయా? జాగ్రత్త!

image

మనిషిని కుంగదీస్తున్న మానసిక రోదన వెనక అనేక కారణాలు ఉన్నాయని మేడిపల్లి డా.సుప్రజ తెలిపారు. మనసు విశ్రాంతిని, మార్పును కోరుకుంటోందని చెప్పే సంకేతం. నీరసం, చిన్నదానికే కోపం, కన్నీళ్లు, నలుగురిలోకి వెళ్లలేకపోవడం లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, SM వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఫోన్లు దూరంపెట్టి నచ్చిన పనిచేస్తే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయన్నారు.