News March 19, 2024
ఓయూ బీసీఏ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
HYDలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం

HYDలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోయారు. మ.3 తర్వాత వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం లభించిందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశం మబ్బులతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీ, ఖైరతాబాద్, KPHB, ప్యాట్నీ, సికింద్రాబాద్, ఎల్బీనగర్, హయత్నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
News April 15, 2025
హైదరాబాద్: మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం

నగరంలో వర్షం వస్తే వరద నీరు ఎక్కడికక్కడే ఆగపోతుంది. ఈ సమస్య కొన్నేళ్లుగా సిటీని వేధిస్తోంది. దీంతో వాటర్ లాగింగ్ పాయింట్లను గ్రేటర్ అధికారులు గుర్తించారు. నగరంలో 150 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 65 పాయింట్ల నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేశారు. మిగతా వాటిని త్వరలో పూర్తిచేయనున్నారు.
News April 15, 2025
HYD: ఈ మండలాల నుంచే అధిక దరఖాస్తులు

నగరంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం 3 మండలాల నుంచే వచ్చాయి. అసిఫ్నగర్, బహదూర్పుర, బండ్లగూడ నుంచి అధిక శాతం దరఖాస్తులు రాగా సైదాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హులెవరనేది అధికారులు నిర్ణయిస్తారు.