News January 28, 2025
ఓయూ: మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోండి..

ఓయూలో PHD కేటగిరి-2 ప్రవేశాలకు ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 11వ తేదీ వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేయవచ్చని, మార్చి చివరి వారం నుంచి 45 సబ్జెక్టుల్లో 446 సీట్లకు జరిగే PHD ఎంట్రెన్స్ టెస్ట్-2025కు అర్హత గల అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 1, 2025
HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 1, 2025
HYD: ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్కు చెందిన ముఖేశ్ పాఠక్పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
News December 1, 2025
HYD: మెగా జలమండలి.. DPRపై ఫుల్ ఫోకస్

గ్రేటర్ HYD సహా వివిధ ప్రాంతాలకు విస్తరించి ఉన్న జలమండలి ఇప్పుడు మరింత విస్తరణకు శ్రీకారం చుట్టింది. DPR సిద్ధం చేయడంలో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు.1450.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జలమండలి మరో 603 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెగా జలమండలిగా తాగునీరు, డ్రైనేజీ నెట్వర్క్ సిద్ధమవుతోంది.


