News January 28, 2025
ఓయూ: మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోండి..

ఓయూలో PHD కేటగిరి-2 ప్రవేశాలకు ఈనెల 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 11వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయవచ్చని, మార్చి చివరి వారం నుంచి 45 సబ్జెక్టుల్లో 446 సీట్లకు జరిగే PHD ఎంట్రెన్స్ టెస్ట్-2025కు అర్హత గల అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2025
బిచ్కుంద : పిగ్ మీ పేరిట ఘరానా మోసం

బిచ్కుంద మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో తాత్కాలికంగా దరఖాస్తులు రాసుకుంటూ ఉపాధి పొందుతున్న జంగం రాజు అనే వ్యక్తి ఖాతాదారులను పిగ్ మీ పేరిట భారీగా డిపాజిట్ల సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీయగా తమకు సంబంధం లేదని తేల్చేశారు. మోసం చేసిన వ్యక్తి కుటుంబంతో సహా పరారైయ్యాడు. రూ.60 లక్షలు స్వాహా చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు.
News February 18, 2025
వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్‌సీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.
News February 18, 2025
KMR: టీచరే కీచకుడిగా మారాడు

గాంధారి మండలంలో సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. SI ఆంజనేయులు వివరాలిలా.. మండలంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్ రమేశ్ అదే పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ఫోన్లో చెబుతానని తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకర మెసేజ్‌లు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.