News September 29, 2024
ఓయూ: 30న PDSU స్వర్ణోత్సవాల మహాసభ

PDSU స్వర్ణోత్సవాల మహా సభను ఈ నెల 30న ఓయూలో నిర్వహించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య వక్తలుగా ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జీబీ కోల్సేపాటిల్ హాజరవుతారని పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్పేట-కృష్ణానగర్ రూట్లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.
News October 26, 2025
HYD: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. HYDలో ఈసారి 80 లిక్కర్ షాపులకు 3201 దరఖాస్తులు వచ్చాయి. సికింద్రాబాద్లో 99 షాపులకు 3022 మంది దరఖాస్తు చేశారు. జంటనగరాల నుంచి రూ.186.69 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గ్రేటర్ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం. రేపటి లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.
News October 26, 2025
జూబ్లీహిల్స్: సీరియల్ నంబర్లలో 1, 2, 3 కీలకం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీలు, ఇండిపెండెంట్లకు ECI పార్టీ గుర్తులు, సీరియల్ నంబర్లను కేటాయించింది. 58 మంది పోటీలో ఉన్నా ముగ్గురే కీలకం కానున్నారు. సీరియల్ నంబర్ 1లో BJP, నంబర్ 2లో కాంగ్రెస్, నంబర్ 3లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఓటర్లకు స్పష్టంగా తెలిసేలా ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ప్రదర్శిస్తున్నారు.


