News June 11, 2024

ఓరుగల్లుకు ఏం కావాలి?

image

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర కేబినేట్‌లో చోటుదక్కిన విషయం తెలిసిందే. దీంతో తమజిల్లాకు ఇవి వచ్చేలా చూడాలంటూ జిల్లా వాసులు కోరుతున్నారు.
*మామునూరు ఎయిర్‌పోర్టు
*బయ్యారం, కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లోని బొగ్గు నిక్షేపాల భూగర్భ గనుల ఏర్పాటు
*ఇనుము, గ్రానైట్, బెరైటీస్, డోలమైట్, లాటరైట్ నిక్షేపాల పరిశ్రమల ఏర్పాటు
*వెయ్యి స్తంభాల గుడికి యునెస్కో గుర్తింపు
*ఇల్లెందులో నూతన ఉపరితల గని ఏర్పాటు

Similar News

News November 21, 2025

వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

image

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.

News November 21, 2025

వరంగల్: ఫిట్‌నెస్ లేని స్కూల్ వాహనాలను సీజ్ చేయాలని వినతి

image

ప్రైవేట్ పాఠశాలలో నడుపుతున్న ఫిట్‌నెస్ లేని స్కూల్ వ్యాన్‌లను, టాటా మ్యాజిక్ వాహనాలను సీజ్ చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ ఇన్‌ఛార్జ్ ఆర్టీవో శోభన్ బాబుకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, పీడీఎస్‌యూ నాయకులు అర్జున్, సూర్య పాల్గొన్నారు.

News November 21, 2025

సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

image

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.