News March 10, 2025

ఓరుగల్లులో భూముల ధరకు రెక్కలు!

image

WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News October 26, 2025

మలేరియా రహిత సమాజం కోసం సహకరించాలి: కలెక్టర్

image

గ్రామంలోని ప్రతి ఒక్కరూ మలేరియా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మలేరియా రహిత సమాజం కోసం సహకరించాలని మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. మలేరియాపై ప్రతి గ్రామంలో అవగాహన ముఖ్యమని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గొరడ గ్రామంలో ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ కార్యక్రమం పై అవగాహన కల్పించారు.

News October 26, 2025

NTR: సార్ రాలేదని ప్రారంభోత్సవం ఆపేశారంట..?

image

విజయవాడ పాత ఆసుపత్రిలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. దాతల సాయంతో ఏర్పాటు చేసిన కొత్త RO ప్లాంటును 3 రోజుల క్రితం ప్రారంభించాలని అనుకున్నప్పటికి వర్షం పడటంతో ఓ ముఖ్య అతిథి రాలేదు. ఆ సార్‌కి ఎప్పుడు కుదురుతుందో తెలియకపోవడంతో ప్లాంట్ ప్రారంభించకుండా వదిలేశారు. దీంతో గర్భిణీలు, బంధువులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే ప్లాంటును ప్రారంభించి దాహం తీర్చాలని కోరుతున్నారు.

News October 26, 2025

నెల్లూరు: ప్రైవేట్ ట్రావెల్ బస్సు నుంచి పొగలు

image

కర్నూలు(D) బస్సు దుర్ఘటన మరకవముందే పొదలకూరు(M) మర్రిపల్లి వద్ద మరో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో శనివారం రాత్రి పొగలు వచ్చాయి. దీంతో బస్సు ఆపేశారు. ప్రయాణికులు వెంటనే అందులోంచి దిగేశారు. ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వారు మరో బస్సులో వెళ్లిపోయారు.