News March 10, 2025
ఓరుగల్లులో భూముల ధరకు రెక్కలు!

WGL జిల్లాలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మామునూరులో దాదాపు రూ.2కోట్లకు పైనే ధర పలుకుతున్నట్లు రియల్ వర్గాలు చెబుతున్నాయి. భూ నిర్వాసిత గ్రామాల రైతులు మాత్రం ఎకరాకు రూ.5 కోట్లు ఇవ్వాలని, తమ గ్రామం నుంచే హైవే వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News March 10, 2025
PPM: ’45 మందికి పైగా విద్యార్థులు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూళ్లు’

45 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా పరిగణించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమిస్తుందని అన్నారు. తద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 10, 2025
సంగారెడ్డి: ఇంటర్ సెకండీయర్ హాజరు 98.11%

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 16,084 మంది విద్యార్థులకు గాను 15,780 మంది విద్యార్థులు హాజరయ్యారని (98.11%) ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 304 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 10, 2025
వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలి: పరిటాల సునీత

బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద MLA పరిటాల సునీత అసెంబ్లీలో గళం విప్పారు. ముందుగా బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.47వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కనగానపల్లి మోడల్ పాఠశాలల్లో, చెన్నేకొత్తపల్లి బీసీ బాలుర హాస్టల్, పేరూరు ఎంజేపీ బాలుర పాఠశాల తగినన్ని బాత్ రూమ్‌లు, టాయిలెట్స్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు.