News September 24, 2024

ఓరుగల్లు కీర్తి.. మన అర్జున్

image

ఉమ్మడి WGL చెందిన అర్జున్ చదరంగంలో చరిత్ర సృష్టించాడు. HNK అడ్వకేట్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు జ్యోతి దంపతుల కుమారుడు అర్జున్ చదరంగంలో ప్రపంచ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో నిలిచాడు. 14ఏళ్ల వయసులోనే యూఏఈలో నిర్వహించిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన 45వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు.

Similar News

News November 28, 2025

‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

image

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.

News November 27, 2025

వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

image

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.