News September 24, 2024
ఓరుగల్లు కీర్తి.. మన అర్జున్
ఉమ్మడి WGL చెందిన అర్జున్ చదరంగంలో చరిత్ర సృష్టించాడు. HNK అడ్వకేట్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు జ్యోతి దంపతుల కుమారుడు అర్జున్ చదరంగంలో ప్రపంచ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో నిలిచాడు. 14ఏళ్ల వయసులోనే యూఏఈలో నిర్వహించిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన 45వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు.
Similar News
News October 15, 2024
ట్రాన్స్‌ఫార్మర్లపై టోల్ ఫ్రీ నెంబర్లు ముద్రించాలి: CMD
TGNPDCL, హనుమకొండ, విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్ని సర్కిళ్ల SE, డివిజినల్ ఇంజినీర్ల(టెక్నికల్)తో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. CMD మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌పై టోల్ ఫ్రీ నంబర్లు 18004250028, 1912 ముద్రించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ఈ నంబర్లను వినియోగదారులకు చేరేలా చూడాలన్నారు.
News October 15, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> WGL: కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
> MHBD: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
> WGL: గడ్డి మందు తాగి యువకుడు మృతి!
> HNK: బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
> MHBD: పిడుగుపాటుకు గురై మూడు ఆవులు మృతి
> TRR: బైకును ఢీ-కొట్టిన బోర్ వెల్ లారీ.. వ్యక్తి మృతి
News October 14, 2024
నరకాసుర వధ వేడుకకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ
వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట వద్ద ఈనెల 30న దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ మేరకు సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను అతిథిగా హాజరుకావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆహ్వానించారు. నగరంలోని ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరారు.