News January 12, 2025
ఓర్వకల్లుకు జపాన్ కంపెనీ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో MOU కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.
Similar News
News February 18, 2025
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

కర్నూలులోని 4వ పట్టణ పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలు జరగకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.
News February 17, 2025
కర్నూలులో 38°C ఉష్ణోగ్రత

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత నమోదైంది.
News February 17, 2025
కర్నూల్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.