News March 20, 2025
ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 22న కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది.
Similar News
News November 28, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
News November 28, 2025
పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలకు పుడా నిధులు

పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 2.60 కోట్లు నిధులు కేటాయించింది. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ.25 లక్షలు, దాచేపల్లి రూ.25 లక్షలు, గురజాల రూ.25 లక్షలు, మాచర్ల రూ.45 లక్షలు, పిడుగురాళ్ల రూ.50 లక్షలు, వినుకొండ రూ.40 లక్షలు, చిలకలూరిపేటకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి వినియోగించనున్నారు.
News November 28, 2025
SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.


