News October 23, 2024

ఓర్వకల్లులో డ్రోన్ హబ్

image

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామక పార్కులో డ్రోన్ హబ్ ఏర్పాటుకానుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించనుంది. అక్కడ డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కేంద్రంలో డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్ హబ్‌లను సైతం తీసుకొచ్చేందుకు మద్దతిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్‌‌లో ఈ మేరకు ప్రకటించారు.

Similar News

News November 13, 2025

కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సీఐలు, ఎస్సై, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్‌లో అనుమానిత వ్యక్తులు, వాహనాలు, పార్సిల్ కార్యాలయాలను పోలీసులు పరిశీలించారు.

News November 13, 2025

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌‌లో సమర్పించాలని సూచించారు.

News November 13, 2025

మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.