News October 23, 2024
ఓర్వకల్లులో డ్రోన్ హబ్
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామక పార్కులో డ్రోన్ హబ్ ఏర్పాటుకానుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలు కేటాయించనుంది. అక్కడ డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ కేంద్రంలో డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్ హబ్‌లను సైతం తీసుకొచ్చేందుకు మద్దతిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అమరావతిలో జరుగుతున్న డ్రోన్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటించారు.
Similar News
News November 7, 2024
‘వెలివేయాలని చూస్తున్నారు.. పోలీసులే న్యాయం చేయాలి’
ఎరుకలు కులస్థులైనందున ఆ ప్రాంతం నుంచి తమను వెలివేయాలని కుట్ర చేస్తున్నారని, పోలీసులు న్యాయం చేయాలని బుధవారం ఎరుకలి రామన్న కుటుంబ సభ్యులు వాపోయారు. ఆదోనిలోని గణేశ్ సర్కిల్ ప్రాంతంలో తాము జీవిస్తున్నామని, సోమవారం ఇంటి పక్కన వారు దాడి చేసి, కులవివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తమకు ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ న్యాయం చేయాలని కోరారు.
News November 7, 2024
చలి మొదలు..
కర్నూలు జిల్లా వ్యాప్తంగా చలి మొదలైంది. తెల్లవారుజామున పొగ మంచు ఎక్కువగా కురుస్తోంది. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో 22°C, 8 గంటల సమయంలో 25 °C నమోదైంది. మరోవైపు వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు సాగాల్సి వస్తోంది. మరి మీ ఊర్లో వాతావరణం ఎలా ఉంది. కామెంట్ చేయండి..
News November 7, 2024
యురేనియం తవ్వకాలపై దుష్ప్రచారం: ఎంపీ నాగరాజు
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలంటూ ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ నాగరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోర్ల తవ్వకాలు జరగడం లేదని అన్నారు. మరోవైపు యురేనియం తవ్వకాలంటూ అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.