News December 20, 2024
ఓర్వకల్లులో రూ.14 వేల కోట్ల పెట్టుబడి: మంత్రి భరత్

ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్.. సెమీ కండక్టర్ రంగంలో రూ.14,000 కోట్ల పెట్టుబడిని అందుకుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ ఓర్వకల్లు పారిశ్రామికవాడలో పారిశ్రామిక వృద్ధిని పెంచడమే కాక, అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. రాబోయే తరాలకు ఆర్థిక శ్రేయస్సును అందిస్తుంది. కర్నూలును ఆవిష్కరణలు, పురోగతికి కేంద్రంగా మార్చాలనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిబద్ధతకు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 27, 2025
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.