News December 29, 2024
ఓర్వకల్లులో వ్యక్తి సూసైడ్

ఓర్వకల్లు మండలంలోని కొమ్ముచెరువు అంజన్న ఆలయం వద్ద శివన్న(57) చెట్టుకు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు . స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.
Similar News
News November 17, 2025
కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

కర్నూలు: రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

సత్ప్రవర్తనతో జీవించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నేరాల్లో మళ్లీ పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.