News December 17, 2024
ఓర్వకల్లు: విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన రైతు బోయ రాముడు(50) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 4 సంవత్సరాల క్రితం పంటల సాగు కోసం చేసిన రూ.8లక్షల అప్పు తీర్చలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆస్తమా వ్యాధి మందులను అధిక మోతాదులో తీసుకోవడంతో కోలుకోలేక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుడి కుమారుడు సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 22, 2026
క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి: కలెక్టర్

సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ నుంచి అంగన్వాడీ కేంద్రాలు, ఇరిగేషన్ అంశాలకు సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై సంబంధిత శాఖల జిల్లా అధికారులలో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.
News January 22, 2026
నంద్యాల: Night view అదరహో!

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఓం నమఃశివాయ!
News January 22, 2026
పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.


