News February 27, 2026
ఓవర్ లోడ్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచండి: సీఎండీ

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్ లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి మరమ్మతు చేపట్టాలన్నారు.
Similar News
News April 15, 2026
ఒకే పంట విధానం.. అన్నదాతకు నష్టం

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News April 15, 2026
పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.
News April 15, 2026
రణరంగమే.. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించడానికి రేపటి నుంచి 3 రోజుల పాటు కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. డీలిమిటేషన్‌కు మహిళా రిజర్వేషన్లను ముడి పెట్టడంపై ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఉభయ సభలు రణరంగాన్ని తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఇండి’ కూటమి పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.


