News January 22, 2025

ఓసి త్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురి అరెస్టు

image

పరశురాంపల్లి సమీపంలోని ఓసిత్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకి చెందిన ఏడుగురు వ్యక్తులు రౌతు భరత్, పల్లపు నర్సింహారావు, కల్లూరి కనకయ్య, రజిత, రౌతు మల్లేశ్వరి, రమాదేవి, బోదాసు చిట్టీలు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.

Similar News

News September 18, 2025

బతుకమ్మ, దసరా పండుగకు 7,754 ప్రత్యేక బస్సులు

image

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా TGSRTC 7,754 ప్రత్యేక బస్సులను సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 2 వరకు నడపనుంది. అందులో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. MGBS, JBS, CBSతో పాటు KPHB, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. అక్టోబర్‌ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా బస్సులను TGSRTC ఏర్పాటు చేయనుంది.

News September 18, 2025

సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో కార్మికుడు మృతి

image

సంతబొమ్మాళి (M)మూలపేట పోర్టులో పనిచేస్తున్న కార్మికుడు పింగ్వా(36) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..జార్ఖండ్‌కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్ట్‌లో కూలీగా పని చేసుందుకు వచ్చాడని, గత మూడు రోజులగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఎస్సై నారాయణాస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 18, 2025

KNR: ‘పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీ తప్పనిసరి’

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జెడ్పీ సమావేశ మందిరంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.