News April 15, 2025

ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని: హీరో నాని

image

‘పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడిని’ అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్- 3’ సినిమా ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖలోని సంగం థియేటర్లో సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని మరిన్ని విషయాలు పంచుకున్నారు.

Similar News

News December 1, 2025

NGKL: నేటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

News December 1, 2025

జిల్లాలో వార్డులవారీగా ఆమోదం పొందిన నామినేషన్లు(తొలిదశ)

image

1. రుద్రంగి మండలం వార్డులు 86, నామినేషన్లు 162
2. చందుర్తి మండలం వార్డులు 174, నామినేషన్లు 393
3. వేములవాడ అర్బన్ మండలం వార్డులు 104, నామినేషన్లు 244
4. వేములవాడ రూరల్ మండలం వార్డులు 146, నామినేషన్లు 329
5. కోనరావుపేట మండలం వార్డులు 238, నామినేషన్లు 496
* మొత్తం వార్డు స్థానాలు 748
* ఆమోదం పొందిన నామినేషన్లు 1,624

News December 1, 2025

KNR: రెండో విడత.. మందకొడిగా నామినేషన్లు..!

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో విడత 418 గ్రామపంచాయతీలకు, 3,794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత మొదటి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లా సర్పంచ్‌కి 121, వార్డు సభ్యులకు 209, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 100, వార్డు సభ్యులకు 116, జగిత్యాల సర్పంచ్‌కి 171, వార్డు సభ్యులకు 238, పెద్దపల్లి సర్పంచ్‌కి 91, వార్డు సభ్యులకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి.