News November 28, 2024
ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR

తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.
Similar News
News July 10, 2025
అవార్డులు అందుకున్న ముగ్గురు జిల్లా అధికారులు

విజయవాడలో బుధవారం జరిగిన సభలో రెడ్‌క్రాస్ నిధుల సేకరణలో విశేష కృషి చేసిన ముగ్గురు జిల్లా అధికారులకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మెడల్స్ అందించి, సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జె.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వేణుగోపాల్, రిటైర్డ్ డీఈఓ వెంకటరమణలు ఈ మెడల్స్‌ను అందుకున్నారు. వీరు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రెడ్‌క్రాస్ సేవల కోసం రూ.5 లక్షలకు పైగా నిధులు సమకూర్చారు.
News July 10, 2025
జిల్లాలో 3 ప్రమాదకర కెమికల్ పరిశ్రమలు: కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ప్రమాదకర కెమికల్ పరిశ్రమలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. తణుకు ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్, తణుకు జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని, భీమవరం డెల్టా పేపర్ మిల్స్ లిమిటెడ్ మూసివేశారన్నారు. 34 పరిశ్రమలు సాధారణ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయన్నారు.
News July 9, 2025
పశ్చిమ గోదావరి రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ జిల్లా అవార్డు

పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022-2023 సంవత్సరానికిగాను ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. బుధవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా ఛైర్మన్ డా. భద్రిరాజు ఈ అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు.