News August 25, 2024

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి: ఈటల

image

వివిధ డిపార్ట్మెంట్లలో నాలుగు నెలలకు ఆరు నెలలకు గ్రాంట్ రూపంలో జీతాలు ఇస్తే పేద ఉద్యోగుల జీవనం ఎలా సాగుతుందని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈ మధ్యవర్తుల దోపిడి ఉండకూడదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే జీతాలు చెల్లిస్తున్నారో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అలానే ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు.

Similar News

News September 16, 2024

కువైట్‌లో జగిత్యాల వాసి మృతి

image

జగిత్యాల పట్టణంలోని 28 వార్డుకు చెందిన కొత్తకొండ సాయికృష్ణ గౌడ్ (37) గుండెపోటుతో ఆకస్మాత్తుగా మరణించాడు. పదేళ్ల నుంచి గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల క్రితమే ఇంటికి వచ్చిన సాయి తిరిగి కువైట్ వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు తన సహచర స్నేహితులు ఫోన్ ద్వారా తెలపడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

News September 16, 2024

KNR: నేడు గంగమ్మ ఒడికి గణనాథులు

image

నవరాత్రుల పాటు పూజలందుకున్న ఏకదంతుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు ఉమ్మడి KNRజిల్లా అంతటా గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10,325 విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటికే కొన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. DJలను నిషేధించినట్లు పోలీసులు ప్రకటించడంతో నిర్వాహకులు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

News September 16, 2024

మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

image

మహమ్మద్ ప్రవక్త మిలాద్-ఉన్-నబీ జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిదక్ (సత్యనిష్ట) తహారత్ (పవిత్రత) జకాత్ (సహాయం) రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.