News February 7, 2025

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప ప్రోగ్రాంలో భాగంగా పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ పేర్కొన్నారు. మడకశిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కావాల్సిన మెలకువలు, వ్యాపార నిర్వహణ శక్తి తదితర వాటి గురించి విరించినట్లు చెప్పారు.

Similar News

News December 5, 2025

సీఎం స్టాలిన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

image

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్‌తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.

News December 5, 2025

SVU: పరీక్ష ఫలితాలు విడుదల.!

image

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc 3, 4 M.A హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం (SVU DDE) ఆధ్వర్యంలో B.LI.Sc పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.