News February 6, 2025

ఔదార్యం చాటుకున్న ఖానాపూర్ మహిళా పోలీసులు

image

ఖానాపూర్ పట్టణంలో బుధవారం మహిళా పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. మల్లీశ్వరి, నర్సమ్మ పట్టణంలో విధలు నిర్వహిస్తుండగా బట్టలు లేకుండా తిరుగుతున్న మతిస్థిమితం లేని ఓ మహిళకు బట్టలు అందజేసి భోజనం పెట్టించారు. అనంతరం ఆమె వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.  

Similar News

News February 9, 2026

చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

image

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కీలకమైన ల్యాండింగ్ సైట్‌ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్‌, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు.

News February 9, 2026

తిరుపతి: స్మార్ట్ సిటీ నిధులు రావు… ప్రభుత్వం ఇవ్వదు.. మరెలా..?

image

స్మార్ట్ సిటీ నిధులతో COC (city operation center) తిరుపతి వాసుల కలగానే నిలిచిపోతుందని చర్చ నడుస్తుంది. బిల్డింగ్ మొత్తం రూ.94.05కోట్లు కాగా 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. స్మార్ట్ సిటీ నిధులు రావు.. ప్రభుత్వం ఇవ్వదు. కౌన్సిల్ చివరి సమావేశంలో దానికి నిధులు లేకపోవడంతో ఎన్నటికి పూర్తవుతుందో అనేది అందరు మాట. దీనిపై ప్రభుత్వం దృష్టికి సైతం పలుమార్లు అధికారులు, నాయకులు తీసుకెళ్లారు.

News February 9, 2026

KNR: పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

image

తిమ్మాపూర్ మండలంలోని, మండల ప్రాథమిక పాఠశాల నుస్తులాపూర్ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మూడవ తరగతి విద్యార్థుల FLS సామర్ధ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులు మొత్తం FLS సామర్ధ్యాలు సాధించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో వివిధ రికార్డులు తనిఖీ చేశారు.