News August 2, 2024

కంకిపాడు: సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య

image

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామస్థుడు జి.అఖిల్ పవన్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ నిమిత్తం గుడివాడ సమీపంలో బేతవోలు గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. కొంత మంది తనను వేధిస్తున్నారని అర్ధరాత్రి సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం పామర్తి కృష్ణ, వీరంకి వంశీ కుమార్’ అని వీడియోలో పేర్కొన్నాడు.

Similar News

News November 18, 2025

కృష్ణా: క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్ల నిల్వలు

image

కృష్ణా జిల్లాలో ‘మీ డబ్బు-మీ హక్కు’ పేరుతో క్లెయిమ్ కాని డిపాజిట్లపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ డి.కె. బాలాజీ ఆవిష్కరించారు. జిల్లాలో మొత్తం 5.59 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.113 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సొమ్మును సరైన డిపాజిటర్లకు లేదా వారి చట్టపరమైన వారసులకు తిరిగి అందించాలనే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News November 17, 2025

వరకట్న వేధింపులు, మరణాలు అడ్డుకోవాలి: కలెక్టర్

image

వరకట్నం వల్ల జరిగే గృహహింస, వేధింపులు, మరణాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన తన ఛాంబర్‌లో వరకట్న నిషేధ చట్టం-1961 జిల్లా సలహా మండలి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం అమలుకు జిల్లా వరకట్న నిషేధ అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు.