News January 18, 2025

కంగ్టి: 60 సంవత్సరాలు పూర్తయిన సభ్యులకు సన్మానం

image

కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సమైక్య సమావేశం నిర్వహించారు. డ్వాక్రా గ్రూప్లో 60 సంవత్సరాలు పూర్తయిన మహిళ మాజీ వార్డు సభ్యురాలు కుమ్మరి సత్యవ్వను గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. సీసీలు రేణుక, కల్లప్ప, వివోఏలు సుమ, సవిత, వివో లీడర్లు మహిళ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News February 11, 2025

మెదక్: కూలి పనులు దొరకలేదని యువకుడి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్(25) పనుల కోసం ఐదు రోజుల క్రితం స్నేహితుడు వద్దకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరకకపోవడంతో మద్యానికి బానిసై దగ్గరున్న డబ్బులు అన్ని ఖర్చు చేశాడు. పని లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 11, 2025

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులకు ఎస్పీ సూచనలు

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్‌ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడారు.

News February 10, 2025

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలుంటే చెప్పండి: అడిషనల్ కలెక్టర్

image

మెదక్ మండలం రాజ్‌పల్లి, హవేలీఘన్పూర్ మండలం మద్దుల్వాయి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే తెలపాలని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం గ్రామాల పోలింగ్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల అభ్యంతరాలపై సమీక్షించారు. మద్దుల్వాయి, రాజ్‌పల్లి పోలింగ్ స్టేషన్ల డ్రాఫ్ట్ విడుదల చేశామన్నారు.

error: Content is protected !!