News March 22, 2024

కంచరపాలెం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్‌లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోర సుధాకర్ రెడ్డి (40) తన అన్న సురేశ్ రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. తనకి వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై అందరితోనూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 14, 2024

సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు

image

దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు అనంతగిరి మండలానికి చెందిన సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. SI టి.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రాకారం విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంక సాయికుమార్, ఇండియన్ నేవీ ఉద్యోగి దిలీప్ కుమార్ జలపాతంలో గల్లంతయినట్లు తోటి స్నేహితులు తెలిపినట్లు చెప్పారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై SI విచారణ చేపడుతున్నారు.

News September 14, 2024

BREAKING: విశాఖలో భారీ అగ్నిప్రమాదం

image

విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌లోని లిథియం బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

విశాఖ: 24 నుంచి ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలు

image

ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలను ఈనెల 24 నుంచి 27 వరకు విశాఖలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 78వ పురుషులు, మహిళల 17వ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ప్రముఖ బాక్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.