News April 24, 2025

కంచరపాలెం: బస్సు ఢీకొని మహిళ మృతి

image

కంచరపాలెం ఊర్వశి జంక్షన్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న ఎన్.మేరీ (62 ) అక్కడికక్కడే చనిపోగా, డ్రైవ్ చేస్తున్న కూతురు సుధారాణి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 24, 2025

చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.

News April 24, 2025

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై గురువారం సమీక్ష జరిగింది. ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీవో నం.39 ప్రకారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్స్‌పై బ్యాంకు అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News April 24, 2025

ఈనెల 26న GVMC డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

image

GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు GVMC కౌన్సిల్ హల్లో నిర్వహించనున్నారు. ఆరోజున సమావేశానికి హాజరవుతున్న సభ్యులు మొబైల్ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

error: Content is protected !!