News April 25, 2024
కంచర్ల కృష్ణారెడ్డి ఆస్తులు@ రూ.82 కోట్లు!

BRS NLG ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. తన పేరుపై రూ.82.6కోట్ల స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నాయన్నారు. తన భార్య పేరిట రూ.1.6 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ.88వేలు, భార్య వద్ద రూ.18,600 ఉన్నాయన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.96లక్షల డిపాజిట్లు ఉన్నట్లు చూపారు. భార్య పేరున 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయన్నారు.
Similar News
News December 10, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ ఎస్పీ

మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
News December 10, 2025
నల్గొండ: ‘తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి’

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొత్తం 14 మండలాల్లోని 318 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు 7,000 మంది సిబ్బంది నియమించగా, 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి మండలానికి డీఆర్సీ కేంద్రాలు, రూట్, జోనల్ అధికారులు నియమించారు. పోలింగ్ సిబ్బందికి వసతి, భోజనం, కిట్‌లతో సహా అన్ని సౌకర్యాలు కల్పించారు.
News December 10, 2025
NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది


