News February 1, 2025

కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాబు..!

image

కంచర్ల గోపన్న 392వ జయంతి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాబైంది. ఐదు రోజులపాటు వాగ్గేయకారోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.నేటి నుంచి 5 వరకు చిత్రకూట మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల సంగీత సంగీత, వాయిద్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భక్త రామదాసు కీర్తనలతో పాటు సంగీత కార్యక్రమాలతో భద్రాద్రి పులకించనుంది.

Similar News

News October 14, 2025

SDPT: ఈ నెల 16,17న జిల్లా స్థాయి సెలక్షన్

image

సిద్దిపేట జిల్లా ఆత్య పత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆత్య, పత్య జూనియర్ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని ప్రధాన కార్యదర్శి బుస్స మహేష్ తెలిపారు. ఈ నెల 16,17తేదీలలో చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెలక్షన్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటిల్లో పాల్గొనాలని సూచించారు.

News October 14, 2025

దేశంలోనే తొలి డ్రోన్‌ హబ్‌ ఓర్వకల్లులోనే..

image

దేశంలోనే తొలి <<18000986>>డ్రోన్ <<>>హన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు కానుంది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతం కాగా దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.

News October 14, 2025

కాజులూరులో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల్లో జిల్లాలో 224.8 mm వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాజులూరు మండలంలో 78.4, అత్యల్పంగా శంఖవరంలో 0.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచార శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సగటున వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలోని 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది.